: పార్టీ బాధ్యతలు ఇక మీవే: కన్నీరు పెట్టుకుంటూ పార్టీ నేతలకు చెప్పిన శశికళ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తనకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో శశికళ నటరాజన్ బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానంలో లొంగిపోవడానికి బయలుదేరిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఆమె పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కన్నీరు పెట్టుకున్నారు. ఇకపై పార్టీని చూసుకోవాల్సిన బాధ్యత మీదేనని ఆమె వ్యాఖ్యానించారు. తమ పార్టీని ఎవ్వరూ చీల్చలేరని వ్యాఖ్యానించారు. ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు.