: శశికళకు మరో షాక్.. రిసార్ట్ నుంచి తప్పించుకున్న ఐదుగురు ఎమ్మెల్యేలు


శశికళ వర్గానికి మరో షాక్ తగిలింది. గోల్డెన్ బే రిసార్ట్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు తప్పించుకుని వచ్చారు. వీరంతా కూడా పన్నీర్ సెల్వంను కలిసి, ఆయనకు మద్దతు తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి రిసార్టులోని సగం మంది ఎమ్మెల్యేలు బస్సుల్లో, తమ వాహనాల్లో నిన్న రాత్రే రిసార్ట్ ను వదిలి వెళ్లిపోయారు. వీరంతా శశికళకు విధేయులుగా చెబుతున్నారు. మిగిలిన వారు మాత్రం ఇంకా రిసార్టులోనే ఉన్నారు. కానీ, ఊహించని విధంగా ఐదుగురు ఎమ్మెల్యేలు ఇవాళ ఉదయం రిసార్ట్ నుంచి జంప్ అయ్యారు.

మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సాయంత్రంలోగా శశికళ లొంగిపోనున్నారు. తాను జైలుకు వెళుతున్న నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీ తన చేతుల్లోంచి జారిపోకుండా... తన మేనల్లుడు దినకరన్ ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా శశి నియమించారు. 

  • Loading...

More Telugu News