: చంద్రబాబు ప్రజెంటేషన్ పై బ్రిటన్ అభ్యంతరం... టూర్ రద్దు!
ట్రేడ్ వాటర్ టెక్నాలజీస్ పై బ్రిటన్ నిర్వహిస్తున్న మూడు రోజుల సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన రద్దు అయింది. బాబు స్థానంలో మంత్రి నారాయణ వెళ్లనున్నట్టు సీఆర్డీయే ప్రకటించింది. ఈ నెల 20 నుంచి ఈ సదస్సును తలపెట్టిన బ్రిటన్, ఏపీ సర్కారుకు కూడా ఆహ్వానం పంపుతూ, సదస్సులో వివరించాలని అనుకుంటున్న విషయమై ప్రజెంటేషన్ పంపాలని కోరింది. దీంతో చంద్రబాబు ఆదేశాల మేరకు భవిష్యత్ అమరావతి, ఉద్యోగావకాశాలు, అభివృద్ధిపై ప్రజెంటేషన్ తయారు చేసి పంపగా, దీన్ని తిరస్కరిస్తూ, జరిగిన అభివృద్ధిని గురించి చెప్పాలని బ్రిటన్ సూచించినట్టు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు సమాచారం.