: జయలలిత బ్యారక్‌లోనే శశికళ?.. జైలులో ఏర్పాట్లు పూర్తి.. భారీ బందోబస్తు


అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కోసం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు ముస్తాబవుతోంది. గతంలో ఇదే కేసులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇదే జైలులో కొన్ని రోజులు ఉన్నారు. అప్పుడామెకు కేటాయించిన బ్యారక్‌లోనే ఇప్పుడు శశికళను కూడా ఉంచే అవకాశం ఉంది. ఈమేరకు సన్నాహాలు పూర్తి చేసిన జైలు అధికారులు ‘చిన్నమ్మ’ రాక కోసం ఎదురుచూస్తున్నారు. సిటీ సెంట్రల్ జైలు వద్ద ముందు జాగ్రత్త చర్యగా వందమంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  కాగా శశికళ ఈ రోజు లొంగిపోతే సాయంత్రంలోగా జైలుకు తరలించే అవకాశం ఉంది. అయితే కేసుపై అప్పీలు దాఖలు చేసుకునే అవకాశం ఉండడంతో మరో రెండు రోజులు ఎదురు చూడాలని శశికళ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News