: ఆ ముగ్గురి సూచనల మేరకే గవర్నర్ నిర్ణయం.. కేంద్రానికి విద్యాసాగర్‌రావు నివేదిక
ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేస్తామంటే, తమకు మద్దతు ఉందంటూ అటు పన్నీర్ సెల్వం, ఇటు పళనిస్వామి ఎవరికి వారే పోటీ పడుతున్న నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం ఎటువైపు? ప్రస్తుతం విద్యాసాగరావు నిర్ణయం కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే నిర్ణయం తీసుకునే ముందు ముగ్గురు న్యాయకోవిదులు.. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, మాజీ సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్, మాజీ ఏజే, రాజ్యాంగ నిపుణుడు సోలీ సొరాబ్జీల సలహాలు, సూచనలు తీసుకున్నారు. తమిళనాట నెలకొన్న పరిస్థితులపై కేంద్రానికి గవర్నర్ ఆదివారమే నివేదిక పంపారు. ఈ సందర్భంగా పై ముగ్గురి అభిప్రాయాలను తీసుకున్నట్టు పేర్కొన్నారు. 1998లో ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించినట్టు వీరికి ఒకేసారి బలపరీక్ష నిర్వహించాలని వీరిలో ఇద్దరు సలహా ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే సోలి సొరాబ్జీ మాత్రం వారం రోజుల్లోపు బల పరీక్షపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించినట్టు తెలుస్తోంది.