: హ్యాంకింగ్ కు గురైన సినీ నటి అమీ జాక్సన్ సెల్ ఫోన్.. లండన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తుందట!


కోలీవుడ్ తెరపై అరంగేట్రం చేసి, బాలీవుడ్, టాలీవుడ్ లో నటించిన అమీ జాక్సన్ సెల్ ఫోన్ హ్యాకింగ్ కు గురైంది. ముంబై నుంచి చెన్నై వెళ్లాల్సిన అమీ జాక్సన్ తన మొబైల్ లో ఏర్పడిన సమస్యను పరిష్కరించాలంటూ ఓ మొబైల్ షాప్ కు వెళ్లింది. అంతే, ఆ కాస్త వ్యవధిలోనే ఆమె వ్యక్తిగత ఫోటోలతో సహా సమాచారం మొత్తం హ్యాకింగ్ కు గురైంది. ఆమె ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిని గుర్తించేసరికి ఆలస్యమైంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమీ జాక్సన్ లండన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది. రజనీకాంత్ 'రోబో 2.0' షూటింగ్ కోసం చెన్నై వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అమీ జాక్సన్ ఆందోళన చెందుతోంది. కాగా అమీ జాక్సన్ బ్రిటన్ జాతీయురాలన్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News