: శశికళను తరలించేందుకు ఖైదీల వ్యాన్ సిద్ధం!


అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను ఈ రోజు రాత్రికి అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గోల్డెన్ బే రిస్టార్ట్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ‘రూట్’ ను క్లియర్ చేసే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు. శశికళను తరలించే నిమిత్తం ఖైదీలను తీసుకువెళ్లే ఒక వ్యాన్ ను పోలీసులు ఇప్పటికే సిద్ధం చేశారని, వైద్య పరీక్షల అనంతరం శశికళను ఇక్కడి నుంచి బెంగళూరు తరలిస్తారని సమాచారం. రిసార్ట్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగోలేదని, తనను అరెస్టు చేయడానికి కొంత సమయం కావాలని శశికళ విన్నవించుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News