: ముద్దులొలికే చిన్నారిని ఎత్తుకుని మురిసిపోయిన సచిన్!


క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓ చిన్నారిని ఎత్తుకుని తెగ మురిసిపోయాడు. అంతేకాదు, ఆ చిన్నారి తన చిట్టి చేతులతో సచిన్ ముఖాన్ని స్పృశిస్తుంటే..లిటిల్ మాస్టర్ సంతోషానికి అవధుల్లేవు. అందుకే, ఈ సంతోషాన్ని తన అభిమానులతో పంచుకోవాలనుకున్న సచిన్, తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఫొటోలను పోస్ట్ చేశాడు. ఇంతకీ, ఆ చిన్నారి ఎవరంటే .. క్రికెటర్ హర్భజన్ సింగ్, గీతా బస్రా దంపతుల చిన్నారి హినాయా హీర్!  ఈ చిన్నారి గత ఏడాది జులై 28న జన్మించింది.

‘చిన్నారి హినాయా హీర్ తో నేను! ఈ చిన్నారి చెప్పలేనంత సంతోషం ఇస్తోంది’ అని సచిన్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. కాగా, హినాయాను సచిన్ ఎత్తుకుని ఉన్న ఫొటోను హర్భజన్ సింగ్ భార్య గీతా బస్రా కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోకు క్యాప్షన్ గా ‘లిటిట్ మాస్టర్ లిటిల్ ఫ్యాన్’ అని పెట్టారు.

  • Loading...

More Telugu News