: పన్నీర్ ను రిసార్ట్స్ కు వెళ్లొద్దని డీజీపీ సూచన!


శశికళకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను గోల్డెన్ బే రిసార్ట్స్ లో కలిసేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న పన్నీర్ సెల్వంను డీజీపీ వారించినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం అంత మంచిది కాదని, బయట ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని పన్నీర్ కు డీజీపీ సూచించారని, అందుకే, పన్నీర్ వెనక్కి తగ్గారని పోలీస్ వర్గాల సమాచారం. కాగా, శశికళకు వీర విధేయుడు, అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా కొత్తగా ఎన్నికైన పళనిస్వామి కొంత సేపటి క్రితం గవర్నర్ ను కలిశారు. మరి కొంచెం సేపట్లో పన్నీరు సెల్వం కూడా గవర్నర్ ను కలవనున్నారు. 

  • Loading...

More Telugu News