: ‘సన్’, ‘రాజ్’ టీవీల షేర్లు దూసుకుపోయాయి!
సన్ టీవీ, రాజ్ టీవీ సంస్థల షేర్లకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. సన్ టీవీ, రాజ్ టీవీ సంస్థల షేర్లను మదుపరులు ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేయడంతో ఆయా సంస్థల షేర్లు వరుసగా 4 శాతం, 12 శాతం లాభపడ్డాయి. కాగా, అక్రమాస్తుల కేసులో శశికళ దోషిగా తేలడం, ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్ కు ఊరట లభించడంతో సన్ టీవి, రాజ్ టీవీ సంస్థల షేర్లు బాగా లాభపడినట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.