: ప్రేమికుల రోజున కార్తీ, అదితితో పాటతో మాయ చేసిన మణిరత్నం


ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం ప్రేమికుల రోజు ప్రేక్షకులను మాయ చేశాడు. తన సినిమాల్లో అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే మణిరత్నం మరోసారి తన తాజా చిత్రం 'చెలియా'లోని ఓ పాట ద్వారా అదే ఫీలింగ్ కలిగించాడు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 'చెలియా' సినిమాలో పాటను ఈ సినిమా హీరో కార్తీ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ పాటలో హీరోయిన్ అదితిరావ్ హైదరి అద్భుతంగా కనిపించింది. అలాగే ఈ సినిమా లొకేషన్లు పాటకు మరింత అందాన్నివ్వగా, గతంలో 'సఖి' సినిమాలో తొలిపాటను గుర్తుతెచ్చాయి. ఈ సినిమాకు గతంలోలానే ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ పాట సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.






  • Loading...

More Telugu News