: మరోసారి సంచలన ఆరోపణలు చేసిన సుబ్రహ్మణ్య స్వామి
బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మరోసారి సంచలన ఆరోపణలతో కలకలం రేపారు. తమిళనాడులో ఏర్పడిన రాజకీయ సంక్షోభం వెనుక ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. వారి పేర్లు సరైన సమయంలో బయటపెడతానని ఆయన తెలిపారు. వారిద్దరే తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో తిరుగుబాటు చేయించారని ఆయన తెలిపారు.
గవర్నర్ విద్యాసాగరరావు కూడా న్యాయబద్ధంగా వ్యవహరించలేదని, ఆయన ఇప్పటికైనా తెలివైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సాయంత్రం ఆరుగంటలలోపు పన్నీరు సెల్వం తన మద్దతు ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు అందజేయని పక్షంలో పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. పళనిస్వామి తనకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల జాబితాను రాజ్ భవన్ కు అందజేశారని ఆయన తెలిపారు. కాగా, శశికళకు మద్దతుగా ట్వీట్ చేయడంపై నెటిజన్లు ఆయనపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.