: త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న గో ఎయిర్ విమానం
ఇంజన్‌లో ఒక్కసారిగా సమస్య తలెత్తిన కారణంగా ముంబయి నుంచి ఢిల్లీకి వచ్చిన గోఎయిర్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. సదరు విమానంలో మొత్తం 183 మంది ప్రయాణికులు ఉన్నారని సంబంధిత అధికారులు తెలిపారు. త్రుటిలో ప్రమాదం తప్పిందని, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఎయిర్ బ్లీడ్ సిస్టమ్‌లో సమస్య తలెత్తడంతో విమానం కమాండర్ ఎడమవైపు ఇంజిన్‌లో పవర్ తగ్గించేశామని చెబుతూ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను అత్యవసర ల్యాండింగ్‌కు ఏర్పాటు చేయమని అధికారులు కోరారు.