: పార్టీలో సఖ్యత కోసం అన్నాడీఎంకే రాజీ మంత్రం?
అన్నాడీఎంకే పార్టీ చీలి పోకుండా, సఖ్యతగా ఉంటే మంచిదనే ఉద్దేశంతో ఆ పార్టీ సీనియర్ నేతలు రాజీ ధోరణికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని నియమించి, సీఎం పగ్గాలు పన్నీర్ సెల్వంకు అప్పగిస్తే బాగుంటుందనే ప్రతిపాదన ఒకటి ముందుకు వచ్చినట్లు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదనకు ఎమ్మెల్యేలు ఏమంటారనే విషయం తేలాల్సి ఉంది. కాగా, అక్రమాస్తులు కేసులో దోషిగా తేలిన శశికళను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. జైలుకు వెళ్లేలోగా అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకునే ప్రయత్నాల్లో శశికళ ఉన్నారని తెలుస్తోంది.