: శశికళకే నాలుగేళ్ల శిక్ష పడింది.. మరి ఇక్కడ ఏ1 జగన్‌కి ఎలాంటి శిక్ష పడుతుందో!: బోండా ఉమా
తమిళనాడులో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో నిందితురాలిగా ఉన్న శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఆ అంశంపై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరావు స్పందించారు. అక్రమాస్తులు కలిగి ఉన్న ఎవరికయినా చివరికి శిక్ష పడాల్సిందేనని, చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని అన్నారు. జయలలితకు చెందిన అక్రమాస్తుల కేసులో శశికళ నటరాజన్ ఏ2 నిందితురాలిగా ఉన్నారని, ఆమె 66 కోట్ల రూపాయల అక్రమాస్తులు కలిగి ఉన్నారని చెప్పారు. ఆమెకే నాలుగేళ్ల శిక్ష పడితే, భారత్‌లోనే అత్యధికంగా 43 వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి ఎలాంటి శిక్ష పడుతుందో ఊహించుకోవాలని బోండా ఉమా అన్నారు.