: కోర్టులోని హాల్ నెంబర్ 48లో లొంగిపోవాలంటూ శశికళకు ఆదేశాలు


బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో లొంగిపోవాలంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు ఆదేశాలు జారీ అయ్యాయి. కోర్టులోని హాల్ నెంబరు 48లో న్యాయమూర్తి అశ్వర్థనారాయణ ముందు లొంగిపోవాలని సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వెంటనే కోర్టులో లొంగిపోవాలంటూ ఆమెకు ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసేందుకు శశికళ సిద్ధమవుతున్నారు.

  • Loading...

More Telugu News