: సమంతను బ్రాండ్ అంబాసడర్ గా నియమించడానికి కారణం ఇదే: కేటీఆర్ పై షబ్బీర్ అలీ ఫైర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో కేటీఆర్ ఓ బచ్చా అని అన్నారు. సినీ హీరో నాగార్జునతో కేటీఆర్ కు లావాదేవీలు ఉన్నాయని... అందుకే చేనేతకు బ్రాండ్ అంబాసడర్ గా నాగార్జునకు కాబోయే కోడలు, హీరోయిన్ సమంతను నియమించారని ఆరోపించారు. రాష్ట్రంలో వైద్య విధానం కూడా సరిగా లేదని... వైద్యం పడకేసిందని... తక్షణమే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని షబ్బీర్ డిమాండ్ చేశారు. వైద్య పరిస్థితిపై గవర్నర్ నరసింహన్ సమీక్ష నిర్వహించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.