: రివ్యూ పిటిషన్ వేస్తాం: అన్నాడీఎంకే నేత తంబిదురై
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో నిందితురాలిగా ఉన్న శశికళ నటరాజన్ కు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో అన్నాడీఎంకే సీనియర్ నేత తంబిదురై ఈ అంశంపై స్పందించారు. ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ... తాము రివ్యూ పిటిషన్ వేస్తామని తెలిపారు. ఇకపై పన్నీర్ సెల్వం తమ పార్టీ నేత కాదని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, తమకు కావాలసినంత మెజార్జీ ఉందని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని తాము ఇప్పటికే గవర్నర్ ను కోరామని, త్వరలోనే గవర్నర్‌ను కలుస్తామని ఆయన తెలిపారు.