: తనకు దక్కకున్నా ఫర్వాలేదు... పన్నీర్ మాత్రం సీఎం కాకూడదని శశికళ పట్టు!


తనకు శిక్ష ఖాయమైన తరువాత వీకే శశికళా నటరాజన్ శరవేగంగా పావులు కదిపి, రెండు గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యేలతో చర్చించి, అనూహ్యంగా పళని స్వామిని తెరపైకి తెచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు. తనకు సీఎం పదవి దక్కుకున్నా ఫర్వాలేదు, పన్నీర్ సెల్వంకు మాత్రం అవకాశం దక్కకుండా చేయాలన్న కృత నిశ్చయంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీలో పళనిస్వామికి సైతం మంచి నేతగా, జయలలితకు విధేయుడిగా, సౌమ్యుడిగా పేరుంది. దీంతో ఆయనైతేనే పార్టీ చీలే అవకాశాలు తక్కువని శశికళ నమ్మినట్టు తెలుస్తోంది. పన్నీర్ సెల్వంకు ఉన్న అవకాశాలను మరింతగా తగ్గించే దిశగా ఆలోచించిన ఆమె, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సైతం ఆయన్ను తొలగిస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు ఈ సమయంలో గవర్నర్ విద్యాసాగర్ రావు ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News