: ఇక పన్నీర్ వర్సెస్ పళనిస్వామి... గవర్నర్ వద్దకు వెళ్లనున్నట్లు తెలిపిన పళనిస్వామి
శశికళ నటరాజన్‌ను దోషిగా తేల్చుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆమె సీఎం అయ్యే దారులు మూసుకుపోయిన నేపథ్యంలో రాష్ట్రమంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత పళనిస్వామిని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై పన్నీర్ సెల్వం, పళనిస్వామికి మధ్య పోటీ ఉండనుంది. పళనిస్వామి ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చారు. కొద్దిసేపట్లో తాము గవర్నర్ విద్యాసాగర్ రావుని కలుస్తామని చెప్పారు. తమకు 129 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. తాము ఇప్పటికే ఈ విషయాన్ని తెలుపుతూ గవర్నర్‌కి ఫ్యాక్స్ పంపించామని చెప్పారు. ఇక ప్రభుత్వ ఏర్పాటే తరువాయి అని అన్నారు. తనను ఎన్నుకున్నట్లు పార్టీ కార్యవర్గం ఫ్యాక్స్ ద్వారా తెలిపిందని ప్రకటించారు.