: ఈ రోజే అసలైన దీపావళి: సుప్రీంకోర్టు తీర్పుపై శశికళ పుష్ప స్పందన
అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీగా ఇటీవలే ఎన్నికైన శశికళకు సుప్రీంకోర్టు తాజాగా నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అన్నాడీఎంకే బహష్కృత ఎంపీ శశికళ పుష్ప స్పందించారు. ఆమె మొదటి నుంచి శశికళ నటరాజన్ అధికారాన్ని విమర్శిస్తోన్న విషయం తెలిసిందే. ఈ రోజు ఓ జాతీయ ఛానెల్ తో ఆమె మాట్లాడుతూ... సీఎం కావాలనుకున్న శశికళకు దారులు మూసుకుపోవడంతో ఆమె హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని తెలిపారు. తమిళనాడులో గూండాయిజం, రౌడీయిజం ఓడిపోయాయని అన్నారు. భారత్లో మంచి ప్రజాస్వామ్యం ఉందని కోర్టు తీర్పు ద్వారా తేలిందని అన్నారు. ప్రజలకు ఈ రోజు అసలైన దీపావళి అని ఆమె అన్నారు.