: టీవీలో తీర్పును చూసిన శశికళ... ఖిన్నురాలైన చిన్నమ్మ!
తనపై సుప్రీంకోర్టులో వెల్లడవుతున్న తీర్పు గురించి అనుక్షణమూ టీవీని అంటిపెట్టుకుని చూసిన శశికళ, తీర్పు తరువాత ఖిన్నురాలైనట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ సుప్రీంకోర్టు వదిలేస్తుందని, ఆపై సీఎం పీఠంపై కూర్చోవాలని ఆశలు పెట్టుకుని, క్యాంపు రాజకీయాలు నడుపుతూ వచ్చిన ఆమె, తీర్పును విన్న తరువాత కన్నీరు పెట్టుకున్నట్టు సమాచారం. దీంతో ఆమె చుట్టూ ఉన్న అన్నాడీఎంకే ముఖ్య నేతలు, ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించినా, ఆమె కన్నీరు ఆగలేదని తెలుస్తోంది. ఆమె తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది తేలాల్సి వుంది.