: రాత్రి రిసార్టులో, తెల్లారి పన్నీర్ ముందుకు... శశికళకు హ్యాండిచ్చిన మెట్టూర్ ఎమ్మెల్యే
క్షణానికో మలుపు తిరుగుతున్న తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంటే, అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత శశికళకు, మరో ఎమ్మెల్యే షాకిచ్చాడు. గోల్డెన్ బే రిసార్టులో గత వారం రోజులుగా ఉన్న మెట్టారు శాసనసభ్యుడు ఎస్ సెమ్మాలయ్, అక్కడి నుంచి తప్పించుకు వచ్చి పన్నీర్ సెల్వం శిబిరంలో చేరిపోయారు. ప్రజలంతా పన్నీర్ వెంటే ఉన్నారని, ప్రజల అభీష్టం మేరకు తాను ఆయనకు మద్దతు తెలిపేందుకు వచ్చానని ఈ సందర్భంగా సెమ్మాలయ్ వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం పన్నీర్ సెల్వం వర్గంలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 13కు పెరిగింది.