: బాహుబలి-2లో బాలీవుడ్ ‘బాద్షా’.. కీలక పాత్రలో షారూఖ్?


బాహుబలి-2 చిత్రం కోసం దేశమంతా ఎదురుచూస్తున్న వేళ ఆసక్తికర అంశం ఒకటి వెలుగుచూసింది. ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు రాజమౌళి ఇప్పటికే షారూఖ్‌తో చర్చలు జరిపినట్టు సమాచారం. చిత్రంలోని ప్రముఖ పాత్రను షారూఖ్‌తో చేయించాలని రాజమౌళి నిర్ణయించారని, ఈ మేరకు చర్చలు జరుపుతున్నారని టాలీవుడ్ భోగట్టా. అయితే ఈ విషయంలో అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు.

చలనచిత్ర రికార్డులు బ్రేక్ చేసిన బాహుబలికి సీక్వెల్‌గా వస్తున్న బాహుబలి-2 కోసం ఇప్పటికే దేశమంతా ఎదురుచూస్తోంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్నకు ఈ చిత్రంలో సమాధానం దొరకబోతోంది. కాగా ఈ సినిమాలో షారూఖ్ ఉంటే సినిమాకు మరింత ప్లస్ అవుతుందని రాజమౌళి భావిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News