: మీ క్యాలెండర్లలో ఈ తేదీని మార్క్ చేయండి!: సచిన్ టెండూల్కర్
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం ‘సచిన్.. ఏ బిలియన్ డ్రీమ్స్’. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సచిన్ ఒక ట్వీట్ చేశాడు. ‘ప్రతి ఒక్కరూ నన్ను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఇది. ఈ తేదీని మీ క్యాలెండర్లలో మార్క్ చేయండి. ‘సచిన్’ చిత్రం 26.05.17న విడుదలవుతోంది’ అని ఆ ట్వీట్ లో సచిన్ పేర్కొన్నాడు. ఈ చిత్రం పోస్టర్ ను కూడా పోస్ట్ చేశాడు. కాగా, జేమ్స్ ఎర్ సకన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో సచిన్ యువకుడిగా ఉన్న పాత్రను టెండూల్కర్ కొడుకు అర్జున్ పోషించడం విశేషం.