: విజయవాడ సబ్ కలెక్టర్ సలోని వినతికి ఆమోదం తెలిపిన ఏపీ ప్రభుత్వం
విజయవాడ సబ్ కలెక్టర్ గా పని చేస్తున్న సలోని సిదాన వినతికి ఏపీ ప్రభుత్వం ఆమెదం తెలిపింది. మధ్యప్రదేశ్ క్యాడర్ కు వెళ్లేందుకు ఆమె పెట్టుకున్న వినతికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 2013 బ్యాచ్ కు చెందిన సలోని పంజాబ్ కు చెందినవారు. అదే బ్యాచ్ ఐఏఎస్ అధికారి, రాజస్థాన్ కు చెందిన ఆశిష్ ను ఆమె పెళ్లాడారు. కేవలం రూ. 500 ఖర్చుతో వీరిద్దరూ నిరాడంబరంగా పెళ్లి చేసుకుని, అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని గోహడ్ లో ఎస్డీఎంగా ఆశిష్ పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, తనను మధ్యప్రదేశ్ క్యాడర్ కు మార్చాలని ఏపీ ప్రభుత్వానికి సలోని విన్నవించుకున్నారు. ఆమె వినతిని పరిశీలించిన ప్రభుత్వం... ఆమెను మధ్యప్రదేశ్ కు పంపేందుకు ఆమెదం తెలిపింది.