: తమ హీరోకి రాయలేదు కాబట్టి నా పాటలు గొప్పవికావని అన్నారు: అనంత శ్రీరాం
ప్రస్తుతం పాటలను ఆరాధించే వారు తమ సామాజిక వర్గానికి చెందిన హీరోకి పాటలు రాయని వారిని పేరున్న పాటల రచయితగా గుర్తించడం లేదని గీత రచయిత అనంత శ్రీరాం అన్నారు. సామాజిక వర్గం భేదాలు, కుల భేదాలు పెరిగిపోతున్నాయని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కి పాట రాయనంత వరకు ఓ సామాజిక వర్గం వారు తనని పాప్యులర్ గీత రచయిత కాదని అనుకున్నారని చెప్పారు. సుమారు 700 పాటలు రాశాక పవన్ కల్యాణ్ సినిమాకి రాసే అవకాశం వచ్చిందని అన్నారు. అంతకు ముందు వరకు పలువురు తనని గొప్ప గీత రచయిత కాదన్నారని చెప్పారు. తమ హీరోకి రాయలేదు కాబట్టి నీ పాటలు గొప్పవికావు అనడం ఏమిటని అనంత శ్రీరాం ప్రశ్నించారు.