: 600 వైద్య విద్యార్థుల పట్టాలు రద్దుకానున్నాయ్!


దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వ్యాపం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు అనూహ్య తీర్పును వెలువరించింది. 2008 నుంచి 2012 మధ్య కాలంలో మధ్యప్రదేశ్ లో ఎంబీబీఎస్ లో చేరిన వారి అడ్మిషన్లు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ లో వ్యాపమ్ ప్రీమెడికల్ పరీక్షను రాసి, ముడుపులు చెల్లించి భారీ ఎత్తున మెడికల్ సీట్లు పొందారనే ఆరోపణల నేపథ్యంలో, ఈ కేసును సుప్రీంకోర్టు విచారించింది. ఇప్పటికే పలువురు విద్యార్థులు జైళ్లలో ఉన్నారు. పలువురు విచారణ ఎదుర్కొంటున్నారు. ఏదేమైనప్పటికీ, సుప్రీంకోర్టు నిర్ణయం ఏకంగా 600 మంది వైద్య విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. వీరంతా తమ పట్టాలను కోల్పోనున్నారు.

  • Loading...

More Telugu News