: అంతా మొసలి కన్నీరే... ధైర్యముంటే ఎమ్మెల్యేలను విడిచి చూడు: పన్నీర్ సెల్వం నిప్పులు


తన వర్గం ఎమ్మెల్యేలను మీడియా ముందు ప్రవేశపెట్టి, కన్నీటితో శశికళ మాట్లాడిన వేళ, పన్నీర్ సెల్వం శశికళ చర్యలను తప్పుబట్టారు. ఆమె మొసలి కన్నీరు కారుస్తోందని ఆరోపించారు. ధైర్యముంటే తాను బంధించిన ఎమ్మెల్యేలను బయటకు పంపించి చూడాలని డిమాండ్ చేశారు. వారందరినీ ఇళ్లకు పంపించాలని, ఆపై ఎవరికి మద్దతు అధికంగా లభిస్తుందో తెలిసిపోతుందని అన్నారు. శశికళ తన మాటలు హాస్యాస్పదమని, హాస్యనటుడు వడివేలును గుర్తుకు తెచ్చాయని ఎద్దేవా చేశారు. ఆడవారైనా, మగవారైనా, తమను తాము సింహాలమని చెప్పుకోవడం ఎంతో కామెడీగా ఉంటుందని, ఆమె మాటలు వింటే, వడివేలు నటించిన కామెడీ సన్నివేశాలు గుర్తొచ్చాయని అన్నారు.

  • Loading...

More Telugu News