: అమ్మ జయలలిత చివరి క్షణాల్లో నాతో ఏం చెప్పారంటే...!: వివరించి చెప్పిన శశికళ
తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో చీలిక వస్తోన్న నేపథ్యంలో శశికళ నటరాజన్ మాటల తూటాలు వదులుతున్నారు. పన్నీర్ సెల్వం ఇటీవలే అమ్మ జయలలిత ఆత్మ తనతో మాట్లాడిందని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ ప్రజల సెంటిమెంట్‌ను తన వైపుకి తిప్పుకునేలా శశికళ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. జయలలిత ఆసుపత్రిలో చనిపోయే చివరి క్షణాల్లో తనతో పలు మాటలు చెప్పిందని ఆమె అన్నారు. మన పార్టీని ఎవరూ నాశనం చేయలేరని తనతో జయలలిత అన్నారని శశికళ తమ ఎమ్మెల్యేలతో చెప్పారు. తాను అమ్మ కోసమే పన్నీర్ సెల్వం లాంటి కొందరు నమ్మకద్రోహుల నుంచి పార్టీని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. తాను జయలలిత చనిపోయిన తర్వాత ఓ ప్రమాణం చేశానని, ఆమె మాట ప్రకారం పార్టీని నాశనం చేయకుండా చూస్తానని ఆమె వ్యాఖ్యానించారు.