: హైదరాబాద్ పాతబస్తీలో బాలుడి ప్రాణాలు తీసిన స్నేక్ ల్యాడర్ గేమ్
హైదరాబాద్‌లోని పాతబస్తీలో మైనర్ బాలురు ఆడుకునే ఆటలు మరోసారి వివాదానికి కారణమై ఓ బాలుడి ప్రాణాలు తీశాయి. మైనర్ బాలురంతా ఒక్కచోట చేరి స్నేక్ ల్యాడర్ గేమ్ ఆడారు. ఈ క్రమంలో, ఫైజల్‌బిన్ ఖలీద్(14) అనే బాలుడు ఇదే గేమ్‌ను అబ్దుల్ అనే బాలుడితో ఆడి గెలిచాడు. ఓటమితో అసహనానికి గురయిన అబ్దుల్.. ఖలీద్‌ని చితకబాదాడు. దీంతో తీవ్రగాయాలపాలయిన ఖలీద్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఖలీద్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.