: అమెరికాలో ఏ క్షణంలోనైనా బద్దలవనున్న డ్యాం... ప్రాణ భయంతో దూర ప్రాంతాలకు వెళుతున్న ఎన్నారైలు
అమెరికాలోని ఓరోవిల్లె ప్రాంతంలో పెను ప్రమాదం ముంచుకొస్తోంది. ఓరోవిల్లె డ్యాం ఎమర్జెన్సీ స్పిల్ వే వద్ద ఓ పెద్ద రంద్రం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, డ్యాం ఏ క్షణంలోనైనా బద్దలయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే కింద ప్రాంతాన్ని భారీ ఎత్తున వరద నీరు ముంచెత్తే ప్రమాదం ఉంది. దీంతో, అక్కడున్న ప్రజలను అధికారులు అత్యవసరంగా ఖాళీ చేయిస్తున్నారు. ఈ ప్రాంత జనాభాలో 13 శాతం మంది ఎన్నారైలే ఉన్నారని తెలుస్తోంది.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పరిస్థితి తమ చేతుల్లో లేదని... ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి, ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పారు. ఇటీవల కాలంలో భారీగా వర్షాలు, మంచు కురవడంతో డ్యాంలోకి నీరు ఎక్కువగా చేరింది. నీటి ఒత్తిడి వల్లే స్పిల్ వేకు రంద్రం పడి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. స్పిల్ వేకు మరమ్మతులు చేయడానికి రూ. 670 నుంచి 1300 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.