: తన ఎమ్మెల్యేలను మీడియా ముందు ప్రవేశపెట్టిన శశికళ!


గోల్డెన్ బే రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ  మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'నా వెనుక ఎంత మంది ఉన్నారో లెక్క పెట్టుకోండి' అని ఆమె అన్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను నిర్బంధించలేదని, ఎమ్మెల్యేలను నిర్బంధించామంటూ పన్నీర్ వర్గం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారని, తమ ఎమ్మెల్యేలను బెదిరింపులకు గురి చేస్తున్నారని, ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేల పిల్లలను కిడ్నాప్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ‘అక్రమాస్తుల కేసులో కోర్టు తీర్పు రానివ్వండి చూద్దాం. మా తర్వాత అడుగేంటో త్వరలో మీకే తెలుస్తుంది. మమ్మల్ని వ్యతిరేకించే వారి ఆటలు ఎంతో కాలం సాగనివ్వం’ అని శశికళ అన్నారు.

  • Loading...

More Telugu News