: కనకరాజ్ హత్యను ఖండించిన శశికళ
అన్నాడీఎంకే నాయకుడు వి.కనకరాజు హత్యకు గురి కావడాన్ని శశికళ ఖండించారు. మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, ఈ రోజు ఉదయం కనకరాజును డీఎంకే పార్టీకి చెందిన కార్యకర్తలు ముగ్గురు హత్య చేశారు. ఆర్థిక లావా దేవీల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని, మూడు కోట్ల రూపాయల వరకు కనకరాజ్ వారికి ఇవ్వాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఎప్పటి నుంచో ఈ విషయమై ప్రశ్నిస్తున్నప్పటికీ కనకరాజ్ స్పందించకపోవడంతోనే ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది.