: టీచర్ పాఠం చెబుతోంది... నా పనిలో నేనున్నా... ఆపై..: పవన్ కల్యాణ్ చిన్ననాటి అనుభవం
ప్రతిష్ఠాత్మక హార్వార్డ్ వర్శిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న వేళ, పవన్ కల్యాణ్ తన చిన్ననాటి అనుభవాన్ని నెమరు వేసుకున్నారు. ఒక రోజు టీచర్ 'మా బడి' అనే పాఠం చెబుతున్న వేళ జరిగిన ఘటన గురించి చెప్పారు. "పాఠశాల ఎలా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది, ఆటస్థలం, చెట్లు, మొక్కలు, లైబ్రరీ తదితర సదుపాయాలు... ఇలా చెప్పుకుంటూ వెళుతున్న వేళ, నేను నా పక్క విద్యార్థితో మాట్లాడుతూ ఉన్నాను. అది చూసిన టీచర్ నన్ను లేపి ఏం మాట్లాడుతున్నావని అడిగింది. మన స్కూల్ లో ఆటస్థలం లేదు, బుక్స్ లేవు, చెట్లు కూడా లేవు. అదే విషయాన్ని చెబుతున్నానని చెప్పాను. అంతే... టీచర్ నన్ను బాగా కొట్టారు. అది ఇప్పటికీ మరచిపోలేను. ఆ క్షణంలో నాకు తెలిసింది ఏంటంటే... పుస్తకాల్లో చెప్పేది వేరు, వాస్తవంగా జరిగేది వేరు. చెప్పేది ఒకటి... చేసేది ఒకటి' అది నాకు ఇప్పటికీ గుర్తుంది. అందుకే నేను నేను రాసిన పరీక్షల్లో విజయవంతంగా ఫెయిల్ అయ్యాను. నా జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది" అన్నారు.