: డిక్లేర్ చేసిన ఇండియా... బంగ్లాదేశ్ లక్ష్యం 459


హైదరాబాద్ లో బంగ్లాదేశ్ లో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్ ను 159 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో 459 పరుగుల కష్టసాధ్యమైన భారీ విజయలక్ష్యంతో బంగ్లాదేశ్ బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ లో రేపు సాయంత్రంలోగా 459 పరుగులు అసాధ్యమని అంచనా కాగా, అప్పటివరకూ వికెట్లను నిలుపుకుంటే, బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ ని డ్రా చేయగలుగుతుంది. ఈలోగా పది వికెట్లనూ తీయాలన్నది ఇండియా లక్ష్యం. ఇండియా రెండో ఇన్నింగ్స్ లో పుజారా 54, కోహ్లీ 38, రహానే 28, జడేజా 16, రాహుల్ 10, విజయ్ 7 పరుగులు చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ స్కోరు వికెట్ నష్టపోకుండా 9 పరుగులు కాగా, మరో 450 పరుగులు చేయాల్సివుంది.

  • Loading...

More Telugu News