: బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో పాత రికార్డులను కనుమరుగు చేసిన అశ్విన్!
భారత ప్రధాన స్పిన్నర్, ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అత్యంత అరుదైన రికార్డును స్థాపించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 250 వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. కేవలం 45 మ్యాచ్ లలో 250 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న మ్యాచ్ లో కెప్టెన్ ముష్పికర్ రెహమాన్ వికెట్ తీయడంతో అశ్విన్ ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డు డెన్నిస్ లిల్లీ పేరిట ఉంది. లిల్లీ 48 టెస్ట్ లలో 250 వికెట్లు తీసిన రికార్డు, నేటితో కనుమరుగై, ఆ స్థానంలో అశ్విన్ పేరు నమోదైంది. కాగా, 2011లో వెస్టిండీస్ పై తొలి టెస్టు మ్యాచ్ ఆడి, ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 3/27, రెండో ఇన్నింగ్స్ లో 6/47 గణాంకాలు నమోదు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.