: మీ జాతకం నా దగ్గరుంది: మోదీపై ఉద్ధవ్ థాకరే


బీఎంసీ (బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్) ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ, 227 సీట్లలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న శివసేన, తమకు ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తోంది. "ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే ఓ జాతకాన్ని కలిగివుంటారు. ప్రధాని ఈ విషయాన్ని మరచిపోరాదు. మావద్ద ఆయన జాతకం ఉంది. అమిత్ షా జన్మ కుండలి కూడా ఉంది" అని పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. ఇకపై రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తు లేకుండానే బరిలోకి దిగుతామని తెలిపారు. కాగా, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో శివసేస కూడా ఉన్నప్పటికీ, మహారాష్ట్ర రాజకీయాలకు వచ్చేసరికి బీజేపీ, శివసేన మధ్య ఉప్పూ నిప్పులా పరిస్థితులు ఉన్నాయి. ఈ నెల 21న ముంబై మునిసిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News