: 388 పరుగులకు బంగ్లా ఆలౌట్... 299 పరుగుల ఆధిక్యంలో ఇండియా
హైదరాబాద్ లో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 388 పరుగులకు ఆలౌట్ అయింది. ముషాఫికుర్ రెహమాన్ అద్భుత రీతిలో సెంచరీ సాధించి, ఆపై కొన్ని మెరుపులు మెరిపించి, 127 పరుగులు (262 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్ లు) సాధించడం గమనార్హం. అతనికి మిగతా ఆటగాళ్లెవ్వరూ సరైన మద్దతు ఇవ్వలేదు. షకీబ్ అల్ హసన్ 82, మెహిదీ హసన్ మిరాజ్ 51 పరుగులు మినహా మరెవరూ చెప్పుకోతగ్గ స్కోరు చేయలేదు. దీంతో తొలి ఇన్నింగ్స్ 687 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన భారత జట్టుకు 299 పరుగుల లీడ్ లభించింది. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ కు 3, జడేజా, అశ్విన్ లకు చెరో రెండు, భువనేశ్వర్, ఇషాంత్ లకు చెరో వికెట్ దక్కాయి.