: గవర్నర్ తీరుపై విరుచుకుపడ్డ శశికళ !
తమిళనాడు ఇంఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావుపై శశికళ విరుచుకుపడ్డారు. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం విషయమై గవర్నర్ కావాలనే జాప్యం చేస్తున్నారని, పార్టీని చీల్చడానికి కుట్ర పన్నుతున్నారని, రేపటి నుంచి కొత్త పద్ధతిలో నిరసనలు చేపడతామని ఆమె అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలను కలిశాక చాలా సంతోషం అనిపించిందని, ఎమ్మెల్యేలంతా ఏక తాటిపైనే ఉన్నారని అన్నారు. గవర్నర్ నుంచి స్పందన వచ్చే వరకు సహనంతో ఎదురుచూస్తామని, అంత వరకు జాగ్రత్తలు తీసుకుంటామని శశికళ స్పష్టం చేశారు.