: పన్నీర్ సెల్వంకు హీరో శరత్ కుమార్ మద్దతు
తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పన్నీర్ సెల్వంకు సీనియర్ నేత పొన్నియన్, కొందరు ఎంపీలు ఆయనకు తాజాగా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. మరింత తాజా సమాచారం ఏంటంటే, పన్నీర్ కు ఆలిండియా సమథువ మక్కల్ కట్చి పార్టీ అధినేత, ప్రముఖ నటుడు శరత్ కుమార్ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. జయలలితకు అత్యంత విశ్వసనీయుడు పన్నీర్ సెల్వం అని, అందుకే, ఆయనకు తన మద్దతు తెలిపానని అన్నారు.