: నేను చచ్చిపోతే.. నా పిల్లలకు దిక్కెవరు?: కన్నీటి పర్యంతమైన రోజా


‘నేను చచ్చిపోతే.. నా పిల్లలకు దిక్కెవరు?’ అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా కన్నీటి పర్యంతమయ్యారు. అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్తున్న రోజాను గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి హైదరాబాద్ మణికొండలో ఉన్న ఆమె నివాసానికి తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదారాబాద్ లోని వైఎస్సార్సీపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో రోజా మాట్లాడుతూ, ‘అసెంబ్లీలో నేను అడుగుపెట్టిన రోజు నుంచి నన్ను వేధిస్తున్నారు, ఈ రోజు నా ఫోన్ లాక్కున్నారు. నా గన్ మెన్ ను తీసేశారు. నా ప్రాణాలకు రక్షణ ఏంటి? నన్ను చంపేయరని గ్యారంటీ ఏమిటి? నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏమిటి? వాళ్లకు దిక్కెవరు?’ అంటూ రోజా కన్నీటి పర్యంతమయ్యారు.  

  • Loading...

More Telugu News