: వ్యూహం మార్చిన శశికళ ! విధేయుడికి సీఎం పగ్గాలు అప్పగించాలని నిర్ణయించిన చిన్నమ్మ!
సీఎం కుర్చీని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తన వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. శశికళ తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలను గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఉంచిన విషయం తెలిసిందే. కాస్సేపటి క్రితం వారితో జరిపిన మంతనాలు ముగిశాయి. అనంతరం ఆమె తన వ్యూహం మార్చినట్లు సమాచారం. తనకు విధేయుడు అయిన వ్యక్తిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ విధేయుల జాబితాలో సెంగొట్టయ్యన్ లేదా పళనిస్వామి పేర్లు ఉన్నాయి. శాసనసభాపక్ష నేతగా వాళ్లిద్దరిలో ఎవరినో ఒకరిని ఎన్నుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. శాసనసభా పక్ష నేత ఎన్నిక వివరాలతో రాజ్ భవన్ కు వెళ్లేందుకు శశికళ బృందం బయలుదేరి వెళ్లింది.