: పవన్ కల్యాణ్ సినిమా నైజాం హక్కులను సొంతం చేసుకున్న యంగ్ హీరో
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'కాటమరాయుడు' సినిమా నైజాం హక్కులను సొంతం చేసుకున్నట్టు యంగ్ హీరో నితిన్ తెలిపాడు. తమ సొంత డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన శ్రేష్ఠ్ మూవీస్... ఆసియన్ ఫిల్మ్స్ తో కలసి ఈ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తుందని చెప్పాడు. తన అభిమాన హీరో పవన్ కల్యాణ్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పాడు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను వెల్లడించాడు నితిన్. ఈ సినిమాలో పవన్ సరసన శ్రుతిహాసన్ నటిస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వం వహించాడు. ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.