: శశికళకు మరో షాక్... మరో నేత జంప్
అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో శశికళ నటరాజన్‌కు ఆ పార్టీ నేతలు షాక్ ల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే ఆమె వర్గాన్ని వీడి పన్నీర్ సెల్వం వద్దకు పలువురు నేతలు, మంత్రులు వచ్చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ కోశాధికారి దిండిగల్ శ్రీనివాసన్ కూడా పన్నీర్ సెల్వం గూటికి చేరినట్లు సమాచారం. ఇటీవలే శశికళ ఆయనను పన్నీర్ సెల్వం స్థానంలో కోశాధికారిగా నియమించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మరింత సమాచారం అందాల్సి ఉంది.