: తమిళనాడులో అరాచకాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు: మైత్రేయన్
అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో శశికళ నటరాజన్ తీరు ఏంటో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నాడీఎంకే నేత, రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శశికళ వర్గంలో భయం మొదలైందని, దాంతో ఇక ఎంతకైనా తెగించేందుకు సిద్ధమైందని చెప్పారు. తమిళనాడులో అరాచకాలు సృష్టించేందుకు కూడా సిద్ధమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు, నేతలు అంతా పన్నీర్ సెల్వం వైపే కదులుతున్నారని, ఇక విజయం పన్నీర్ దేనని ఆయన ఉద్ఘాటించారు. న్యాయం, ధర్మం గెలిచి తీరుతుందని చెప్పారు. తమిళనాడులో శాంతిభద్రతలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాము కోరనున్నామని చెప్పారు.