: పెవిలియన్ కు క్యూ కడుతున్న బంగ్లా బ్యాట్స్ మెన్


హైదరాబాదులో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో నిన్నటి వరకు టీమిండియా బ్యాట్స్ మెన్ విరుచుకుపడగా... ఈ రోజు బౌలర్లు సత్తా చాటుతున్నారు. భారత బౌలర్ల ధాటికి పరుగులు చేయడానికి బంగ్లా బ్యాట్స్ మెన్ నానా తంటాలు పడుతున్నారు. ఒక్క వికెట్ నష్టానికి 41 పరుగులతో ఈ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్... భోజన విరామ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. అనంతరం, మోమినుల్ హక్ 12 పరుగులు చేసి ఉమేష్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత మహ్ముదుల్లా 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాంత్ శర్మ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ప్రస్తుతం షకీబ్ అల్ హసన్ (29), ముష్ఫికర్ రహీమ్ (6)లు క్రీజులో ఉన్నారు. 

  • Loading...

More Telugu News