: రమ్మన్నారు.. అదుపులోకి తీసుకున్నారు: పోలీసు వాహనంలో రోజా ఆవేదన


అమరావతిలో జరుగుతున్న మహిళ పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టుకి వ‌చ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా పోలీసు వాహనంలో ఆమెను వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. పోలీసు వాహనంలోనే రోజా మాట్లాడుతూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను మాట్లాడి, అన్యాయాల‌పై ప్ర‌శ్నిస్తాన‌నే భ‌యం ఉంటే త‌న‌నెందుకు ర‌మ్మ‌న్నారని ఆమె ప్ర‌శ్నించారు. నిజాలు చెప్ప‌డానికి నేను రాకూడ‌దా? అని ఆమె అన్నారు. ఆహ్వాన ప‌త్రిక వ‌చ్చింది కాబ‌ట్టే తాను అక్క‌డ‌కు వ‌చ్చాన‌ని అన్నారు.  ‘ఓ మ‌హిళా ఎమ్మెల్యే ప్ర‌శ్నిస్తుంద‌ని భ‌య‌ప‌డుతున్నారు.. నిజంగా వీళ్లు మ‌గాళ్లేనా?’ అంటూ ఆమె ప్ర‌శ్నించారు. తన‌కు అందిన‌ పాస్‌ను తాను అధికారుల‌కు కూడా చూపించాన‌ని, అయినప్ప‌టికీ త‌న‌ను ఎయిర్‌పోర్టులోనే సుమారు గంట‌సేపు ఉంచార‌ని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News