: విజయకాంత్ కు మళ్లీ కోపం వచ్చింది.. కార్యకర్త చెంప ఛెళ్లుమనిపించారు!


డీఎండీకే అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయకాంత్ కు మళ్లీ కోపం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోతూ, అందరి ముందూ ఓ కార్యకర్త చెంపను ఆయన ఛెళ్లుమనిపించారు. ఇంతకూ ఆ కార్యకర్త చేసిన తప్పేంటంటే... జిందాబాద్ బదులు వర్ధిల్లాలి అని అనడమే. తమిళనాడులోని పెరంబళూరులో డీఎండీకే ఆధ్వర్యంలో నిన్న 'మీతో నేను' అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయకాంత్ సహా ఆ పార్టీ స్థానిక నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమస్యలను విజయకాంత్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత వేదిక దిగి బయటకు వస్తుండగా... ఓ కార్యకర్త 'విజయకాంత్ వర్దిల్లాలి' అంటూ గట్టిగా అరిచాడు. దీంతో, ఆ కార్యకర్త చెంపను విజయకాంత్ ఛెళ్లుమనిపించారు. 

  • Loading...

More Telugu News