: ఇద్దరు క్రీడాకారిణులపై అత్యాచారం చేసిన కోచ్
ఇద్దరు జాతీయ స్థాయి తైక్వాండో క్రీడాకారిణులపై కోచ్ అత్యాచారం చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్ రాష్ట్రంలో ఈ దారుణం చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన ఇద్దరు క్రీడాకారిణులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, 9వ తరగతి చదువుతున్న క్రీడాకారిణి కోచ్ కు ఫోన్ చేయగా... ఇంటికి రమ్మన్నాడు. అనంతరం మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి, అత్యాచారం చేశాడు. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత కోచ్ ను ప్రశ్నించింది. దీంతో, అభ్యంతరకరంగా ఉన్న ఫొటోలను, వీడియోను చూపించి... జరిగిన దాని గురించి ఎవరికైనా చెబితే, వీటిని బయటపెడతానని కోచ్ బెదిరించాడు.
తనకు మత్తు మందు కలిపిన భోజనం పెట్టి, ఆ తర్వాత అత్యాచారం చేశాడని మరో క్రీడాకారిణి పోలీసులకు తెలిపింది. ఈ ఫిర్యాదులపై ఢిల్లీ డీసీపీ మణదీప్ రాంధ్వా మాట్లాడుతూ, దర్యాప్తును ప్రారంభించామని తెలిపారు.